బాణాసంచా కేంద్రాలపై పోలీసుల నిఘా
W.G: కాకినాడ జిల్లా వేట్లపాలెం దుర్ఘటన నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పాలకొల్లులో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ నిబంధనల అమలును పరిశీలించారు. తయారీ కేంద్రాలు జనావాసాలకు దూరంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేసి, నిల్వలను రికార్డులతో సరిపోల్చారు.