విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ-రాయపూర్ ప్యాసింజర్ (58527/28), విశాఖ - కోరాపూట్ పాసింజర్ (58537/38), విశాఖ - భవానిపట్నం ప్యాసింజర్ (58503/04)ను ఆగస్టు 19 నుంచి 28 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.