'షార్ట్ సర్క్యూట్ సమయంలో జాగ్రత్తలు పాటించాలి'

'షార్ట్ సర్క్యూట్ సమయంలో జాగ్రత్తలు పాటించాలి'

TPT: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలని అగ్నిమాపక కేంద్రాధికారి రాజయ్య సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల, శ్రీవెంకటేశ్వర ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షార్ట్ సర్క్యూట్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో కూడా నిర్వహించారు.