సమస్యల పరిష్కారం కోరుతూ హమాలీలు ఆందోళనలు

ELR: సమస్యల పరిష్కారం కోరుతూ ఏలూరులో హమాలీలు మంగళవారం ఆందోళనలు చేపట్టారు. కూలీ రేట్లు పెంచాలంటూ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా హమాలీలు(కూలీలు) మార్కెట్ యార్డు, ఎఫిసిఐ గోడౌన్ వద్ద నిరసనలు కొనసాగించారు. పనికి తగ్గ కూలీ సొమ్ము రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. బోనస్, ఈఎస్ఐను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.