ప్రజాదర్బార్‌లో వినుతులు స్వీకరించిన ఎమ్మెల్యే
NTR: చందర్లపాడు మండలం కోనయపాలెంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. అధికారులను ప్రజల వద్దకే తీసుకువచ్చి తక్షణ పరిష్కారం చూపడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం, అడవి ఆవుల సమస్య, పంట కొనుగోలు విషయాలను సీఎం చంద్రబాబుకు తెలియజేయగా, సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.