బావుల్లో చేపలను విడిచి పెట్టిన సర్పంచ్
AKP: గొలుగొండ మండలం పాతమల్లంపేటలో దోమల నియంత్రణ కోసం ఆరోగ్య కార్యకర్తలు బావుల్లో గంబూసియా చేపలను మంగళవారం విడుదల చేశారు. ఇవి బావుల్లోని దోమలు, వాటి గుడ్లను నాశనం చేస్తాయని సచివాలయం ఏఎన్ఎం వివరించారు. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ గెడ్డం ఆదిలక్ష్మీ అన్నారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు.