వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జగ్గయ్యపేట పట్టణంలోని వైవై కాలనీ, ఆర్టీసీ కాలనీ, దుర్గాపురం, చెరువు అలుగు, రైల్వే ట్రాక్ వద్ద రోడ్లు కోతకు గురయ్యాయి. ఈ ప్రాంతాలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) స్వయంగా సందర్శించారు. వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.