గుణాత్మక విద్యను అందించాలి: అదనపు కలెక్టర్

ASF: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సమాజ విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు పట్టిక, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసేలా అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.