తెలంగాణ ఫుడ్స్‌లో బతుకమ్మ సంబరాలు
మేడ్చల్: నాచారంలో ఉన్న తెలంగాణ ఫుడ్స్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన సంస్కృతి కాపాడే విధంగా తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలకు తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ ఎంఏ ఫహీం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న మహిళలకు ఆయన చేతుల మీదుగా దసరా, బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేశారు.