గురుకుల పాఠశాలలో మంత్రి స్వామి ఆకస్మిక తనిఖీ
ప్రకాశం: కొండేపిలోని సింగరాయకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలను మంత్రి స్వామి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఆధునిక వంట పరికరాలతో కూడిన మేకనైజ్డ్ కిచెన్ నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 14 బెంచ్ మార్క్ గురుకులాల్లో ఇటువంటి వంటగదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.