నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLG: నకిరేకల్ పట్టణంలో 11 కేవీ విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపులో భాగంగా, నేడు పట్టణంలో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు, మండల విద్యుత్ ఏఈ ధర్మతేజ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యుత్తు అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.