‘ఆదోని జిల్లా ఏర్పాటు సీఎంతోనే సాధ్యం'

KRNL: ఆదోని జిల్లా ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ పేర్కొన్నారు. ఇవాళ అహ్మద్ మాట్లాడుతూ.. బిహార్ కన్నా వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది ఆదోని అని అన్నారు. ఆరేళ్ల నుంచి ఆదోనిని జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి పోరాటం చేస్తుందని తెలిపారు.