VIDEO: సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న రైతులు
JN: పాలకుర్తి (M)లోని ఓ మహిళా రైతు రూ.7 లక్షల అప్పు చేసి సాగు చేసిన పంటకు నీళ్లు లేక ఎండిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట పోతుంటే బాధతో అన్నం కూడా తినబుద్ధి కావడం లేదని ఆమె వాపోయింది. ఎలక్షన్ల అనంతరం MLA యశస్విని రెడ్డి గ్రామానికి రావడం లేదని, రైతు బంధు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే MLA స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు.