భార్యపై కత్తితో దాడి.. ఎస్సై దర్యాప్తు.!

KMM: మధిర మండలం మాటూరు బీసీ కాలనీలో భార్య నాగలక్ష్మిపై అనుమానంతో భర్త సూర్యనారాయణ ఆదివారం కత్తితో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరగడానికి గల కారణాలను ఎస్సై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రస్తుతం నాగలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.