రైతులు సాగు నీరు లేక విలవిలలాడుతున్నారు

రైతులు సాగు నీరు లేక విలవిలలాడుతున్నారు

 కరీంనగర్: నీరు లేక పంట ఎండిపోతున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లోని దాదాపు 12 గ్రామాల రైతులు సాగు నీరు లేక విలవిల్లాడుతున్నారు. నీరు లేక సుమారు 5 వేల ఎకరాలకు పైనే పంట ఎండిపోతోంది. అధికారులను కలిసి శ్రీరాంసాగర్ డ్యాం ద్వారా నీటిని విడుదల చేయాలని కోరినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.