నల్లపాడు ఠాణాలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

నల్లపాడు ఠాణాలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్‌ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. శాంతిభద్రతలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. గంజాయి, బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేస్తామని తెలిపారు.