తిప్పర్తిలో ఐద్వా శిక్షణ తరగతులు

NLG: తిప్పర్తి నర్రా రాఘవరెడ్డి స్మారక భవనంలో ఐద్వా నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై దాడులను అరికట్టడంలో విఫలమైపోయాయని ఆరోపించారు. మత రాజకీయాల పేరిట మహిళలపై చిన్నచూపు పెరిగిందన్నారు. మహిళల హక్కుల కోసం ఐద్వా ఉద్యమాలు ముమ్మరం చేస్తుందని హెచ్చరించారు.