పశువైద్య శిబిరంలో 70 పశువులకు ఆరోగ్య పరీక్షలు

పశువైద్య శిబిరంలో 70 పశువులకు ఆరోగ్య పరీక్షలు

బాపట్ల వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో శనివారం కావూరువారిపాలెం పంచాయతీలో పశువైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో 70 పశువులకు, ముఖ్యంగా దూడలకు ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కళాశాల కో-ఆర్డినేటర్ లలిత మాట్లాడుతూ.. రైతులు పశువుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉంటూ.. సకాలంలో చికిత్స అందించి నష్టాలను నివారించాలని సూచించారు.