లోక్‌సభలో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షోభం తర్వాత ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. అలాగే, విమాన టికెట్ ధరలను నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఇండిగో వ్యవహారంపై ఇప్పటికే ఆ సంస్థ సీఈఓను ప్రశ్నించినట్లు తెలిపారు.