VIDEO: ఘనంగా గుబ్బల జాతర మహోత్సవాల ఏర్పాట్లు

VIDEO: ఘనంగా గుబ్బల జాతర మహోత్సవాల ఏర్పాట్లు

E.G: గోకవరం గ్రామ దేవత మాతృశ్రీ గుబ్బల అమ్మవారి జాతర మహోత్సవాలు ఉగాది సందర్భంగా ఈ నెల 18 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం ఆలయ కమిటీ సభ్యులు జాతర ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారని కమిటీ సభ్యులు తెలిపారు.