ఖతర్‌పై దాడిని సమర్థించుకున్న నెతన్యాహు

ఖతర్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిని పలు దేశాలు ఖండించాయి. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఈ సందర్భంగా 2023 అక్టోబరు 7న హమాస్ దాడిని 9/11 దాడితో పోల్చారు. అప్పుడు యూఎస్ ఎలా స్పందించిందో ప్రస్తుతం తాము అలాగే చేశామని అన్నారు.