యోగా పోటీలలో జిల్లా విద్యార్థులకు బహుమతులు

ASF: తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కొమరం భీం జిల్లా విద్యార్థులు 2 బహుమతులు పొందినట్లు యోగాసనా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో శ్రీయన్ గోల్డ్ మెడల్, లెగ్ బ్యాలెన్స్ విభాగంలో అఖిల్ సింగ్‌లకు సిల్వర్ మెడల్ సాధించారు. ఈనెల 28న విజయవాడలో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం వీరికి దక్కిందన్నారు.