'జాగృతి'లోకి భారీ చేరికలు
KNR: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు యువకులు, మహిళలు గురువారం పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ ఆధ్వర్యంలో వినీత్ కుమార్, తాజ్, రణధీర్, నవ్య, మాధవి తదితరులకు కవిత కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు.