క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి

ADB: పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ ప్రసూతి వార్డులో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పిల్లలకు సక్రమంగా వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ ప్రీతి ఉన్నారు.