నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
GNTR: దుగ్గిరాల మండలం పేరకలపూడి, చినపాలెం గ్రామాలకు ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు డిస్కం ఏఈ గోపీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి అదికారులకు సహకరించాలని కోరారు.