ఆటోని ఢీ కొట్టిన కారు..పలువురికి గాయాలు

ఆటోని ఢీ కొట్టిన కారు..పలువురికి గాయాలు

NGKL: ఆటోను కారు ఢీ కొట్టిన ఘటన తెలకపల్లి మండలం గోలగుండం గ్రామశివారులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్యాసింజర్ ఆటోలో విద్యార్థులతో పాటు కూలీలను ఎక్కించుకొని తెలకపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొట్టగా ఆటో పంట పొలాలలోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు