'ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి'

'ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి'

BHNG: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న శాంతియుత నిరసన దీక్ష చేపట్టనున్నట్లు, BRS బీబీన‌గ‌ర్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్‌ తెలిపారు. శనివారం పార్టీ బీబీనగర్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు గోలి సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షా కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.