గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీకి పుస్తకాల వితరణ
VZM: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పుస్తక వితరణ కార్యక్రమంలో మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీకి సంఘం తరఫున 3000రూపాయల విలువ చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్‌ను ప్రిన్సిపల్ డా.కె.రేఖకు అందజేశారు.