వాడపల్లిలో ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ కమిషనర్

కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఏర్పాట్లను డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం టెంట్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, క్యూలైన్లు, మురుగుదొడ్లు, పార్కింగ్ వంట సదుపాయాలు కల్పించారు.