అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ
అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై డిసెంబరు 16లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా, రాజస్థాన్‌లో కస్టోడియల్ హింసలో 11 మంది మృతి చెందడాన్ని సీరియస్‌గా తీసుకుని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.