త్వరలో పోస్టుమార్టం గది నిర్మాణం: ఎమ్మెల్యే
NLR: బుచ్చి మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకపాలెం వద్ద ఉన్న మార్చురీ గది స్థలాన్ని పరిశీలించి త్వరలో మార్చురీ గది నిర్మిస్తామని MLA వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు. అక్కడ పార్థివ దేహాల తరలింపునకు అసౌకర్యం కలగకుండా స్థానిక నాయకులతో మాట్లాడి చర్యలు చేపడతామని వెల్లడించారు. మంగళకట్ట స్మశాన వాటికకు ప్రహరీ కూడా త్వరలో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు.