పెట్రోల్ కోసం బారులు తీరిన బైకర్లు
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారింది. పలుచోట్ల పెట్రోల్ బంకులు స్టాక్ లేక మూతపడగా, తెరిచి ఉన్నా కొన్ని బంకుల వద్ద సోమవారం వాహనదారులు భారీగా బారులు తీరుతున్నారు. అత్యవసర పనుల కోసం బయలుదేరిన ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని పెట్రోల్ బంకు యజమానులు పరిమితంగా రూ.100 మాత్రమే ఇంధనం సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు.