స్పీడ్ బ్రేకర్స్‌ను సరి చేస్తున్న అధికారులు
అనకాపల్లి పట్టణం విజయరామరాజుపేట రైల్వే గేటు వద్ద నిర్మించిన అతిపెద్ద స్పీడ్ బ్రేకర్స్‌పై స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు వాటిని సరిచేస్తున్నారు. ఈనెల 27న కూటమి నాయకులు, వైసీపీ శ్రేణులు వేరువేరుగా నిరసన తెలియజేశారు. ఈ విషయం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించారు.