'ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించుకోవాలి'

RR: షాద్‌నగర్ పట్టణ కోర్టు కాంప్లెక్స్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి స్వాతి రెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు దేశభక్తి, జాతీయ స్ఫూర్తి పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.