అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
KMM: చింతకాని మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండలంలోని జగన్నాథపురం గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పందిళ్లపల్లి మున్నేరు నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఇవాళ ఎస్సై వీరేందర్ తెలిపారు.