నర్సింగ్ కళాశాలల్లో అక్రమాలపై NHRC సీరియస్
TG: రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ కళాశాలల్లోని అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) సంబంధిత అధికారులను ఆదేశించింది. సరైన వసతులు, అధ్యాపకులు లేకుండా మధ్యవర్తుల ద్వారా అక్రమంగా అనుమతులు, ఒకే భవనంలో 8 కళాశాలలు వంటి మోసాలపై నిఘా పెంచాలని తెలిపింది. దీనిపై పూర్తి విచారణ జరిపి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.