VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గత 10 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. మంగళవారం ఆరోగ్య కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు హాస్పిటల్ పునరుద్ధరణ కోసం రూ.10 లక్షలనిధులు కేటాయించారు. తక్షణమే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.