భారీ వర్షాలు.. మొక్కజొన్న పంట నష్టం

సత్యసాయి: వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి సోమవారం రొద్దం మండలంలో పలు పంట పొలాలకు నష్టం వాటిల్లింది. రామాంజనేయులు అనే రైతు ఒక ఎకరంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. వర్షపు నీటికి పంట మొత్తం కొట్టుకు పోయిందన్నారు. దీంతో రూ.25 వేలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.