'డీఎస్సీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి'

GNTR: జూన్ 6వతేదీ నుంచి మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై సమీక్షించారు. డీఎస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు.