ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తా: ఎమ్మెల్సీ

ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తా: ఎమ్మెల్సీ

ELR: ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం మీకోసం పోరాడుతానని తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తి అన్నారు. గురువారం ఆయన ఉంగుటూరు మండలంలో హై స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలను పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపీ మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధ్యాయుల, పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు.