VIDEO: తహశీల్దార్ ఆఫీసులో వీఆర్వో ఆత్మహత్యాయత్నం
పల్నాడు: అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం కలకలం రేగింది. అంబడిపూడి, కొండూరు వీఆర్వోగా పనిచేస్తున్న షేక్ ఇబ్రహీం ఆఫీసులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్టాఫ్ రూమ్‌లో ఆయన అస్వస్థతకు గురికావడాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది.