నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ
KDP: పెండ్లిమర్రి మండలం నూతన ఎస్సైగా తులసి నాగప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో కమలాపురం, సిద్ధవటం, కడప ప్రాంతాలలో ఎస్సైగా సేవలందించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. మండల పరిసర ప్రాంతాల్లో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు.