అంబరాన్ని తాకిన ముందస్తు సంక్రాంతి వేడుకలు
W.G: ఉండి మండలం మహదేవపట్నం హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఇవాళ అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాత రుద్రరాజు అరుణ హాజరయ్యారు.హెచ్ఎం M.జాన్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. విద్యార్థులు పొంగలి వండి, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, గాలి పటాలు, భోగి పండ్లు, భోగి మంటలు, కోడి పందాలుతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలతో పాఠశాల కళకళలాడింది.