VIDEO: పత్తికొండ - ఎమ్మిగనూరు మధ్య రాకపోకలకు అంతరాయం

KRNL: పత్తికొండ మండలం జూటూరు వద్ద రాత్రి కురిసిన భారీ వర్షానికి నల్ల వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పత్తికొండ - ఎమ్మిగనూరు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు, ఆర్టీసీ బస్సులు ప్రయాణించలేకపోయాయని జూటూరు గ్రామస్థులు ఇవాళ తెలిపారు. సర్పంచ్ జయ శ్రీ, టీడీపీ నాయకులు సుదర్శన్ రెడ్డి, శంకర్ రెడ్డి వంక ఉద్ధృతిని పరిశీలించారు.