అనంతగిరి కొండల్లో 'ది బ్రీజ్' షురూ..!
VKB: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా వికార్‌బాద్ జిల్లా అనంతగిరి కొండలలో నిర్మితమైన 'ది బ్రీజ్' ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రకృతి సోయగాల నడుమ ఏర్పాటైన ఈ పర్యాటక కేంద్రం సందర్శకులను ఆకట్టుకునేలా ప్రత్యేక సదుపాయాలతో రూపొందించబడింది. ఈ ప్రారంభంతో ప్రాంతీయ పర్యాటకానికి కొత్త ఊపు లభించడంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.