పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
KMR: బీర్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన దివ్యాంగులతో మాట్లాడారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు.