ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు
VZM: ఎస్.కోట మండల కేంద్రం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉదయం 9 గంటలకు జరిగే డయాల్‌సిస్ సెంటర్ రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొంటారు. ఆనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అదే మండలం ఉసిరి గ్రామంలో జరిగే పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.