రోడ్డు కోసం గుండు కొట్టించుకుని నిరసన

రోడ్డు కోసం గుండు కొట్టించుకుని నిరసన

సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ఉప్పర్ బాడ ప్రాంతంలో రోడ్డు కోసం స్థానికుడు సయ్యద్ నావాజ్ బాషా ఆదివారం వినూత్న నిరసన తెలిపారు. పాత రోడ్డు తవ్వేసి 10 రోజులు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పాత రోడ్డు వద్దే గుండు కొట్టించుకున్నారు. అధికారులు వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.