ఆపరేషన్ సింధూర్.. సోఫియా ఖురేషీ ఎవరంటే?

ఆపరేషన్ సింధూర్‌పై ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ వివరాలు వెల్లడించి అందరి దృష్టినీ ఆకర్షించారు. గుజరాత్ వడోదరాలోని సైనిక కుటుంబానికి చెందిన ఆమె.. భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. 2016లో పుణెలో జరిగిన 'ఎక్సర్‌సైజ్-18'లో భారత బృందానికి నాయకత్వం వహించారు. 18 దేశాలు పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఏకైక మహిళా కమాండర్ ఖురేషీ కావటం విశేషం.