'అన్యాయానికి గురవుతున్న పేదల అండగా నిలుస్తా'

KMR: అన్యాయానికి గురవుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తానని, అందుకే యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరానని భిక్కనూరుకు చెందిన పెద్ద బచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి తెలిపారు. అమెరికాలో స్థిరపడి, సమాజ సేవ కోసం ఇక్కడికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకున్న వారికి అండగా నిలిచేందుకు ఈ సంస్థలో చేరినట్లు తెలిపారు.